Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 8:07 pm Posted by : ramakrishna

సీబీఎస్ఈ ఫలితాల్లో మెరిసిన నవ్య భారతి గ్లోబల్ స్కూల్ విద్యార్థులు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

సీబీఎస్ఈ విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో నగరంలోని నవ్య భారతి గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మెరిశారు. ఈ ఫలితాల్లో శౌర్య శ్రీవాత్సవ 479/500, రియా పాటిల్ 479/500 మార్కులు, అతుల్ కుమార్ 468/500, నీతికా రెడ్డి 462/500, సాయి ప్రణవి 462/500, నబిహ 456/500, ఇషాని 456/500, సుశాంత్ రెడ్డి 453/500, జోహారిన్ 450/500, పి. నీతికా రెడ్డి 450/500, ఆశ్రిత 448/500 మార్కులు సాధించి ప్రతిభ చాటారు. మొత్తం 130 మంది పాఠశాల విద్యార్థులు పరీక్షలకు హాజరై 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల చైర్మన్ కె.సంతోష్ కుమార్, కరస్పాండెంట్ శ్రీదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సత్కరించారు.

 

Navya Bharati Global School students shine in CBSE results

 

అనంతరం పాఠశాల చైర్మన్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని భవిష్యత్తులో సైతం విద్యార్థులు ఇదే స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షిస్తున్నాం అని అన్నారు. విద్యార్థుల ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కొరకు 13 ఎకరాలలో క్యాంపస్ ఉందని అందులో క్రీడా మైదానాన్ని నిర్మించామని, ఇటీవల ఇండోర్ స్టేడియం లో ఆరు షటిల్ కోర్టులు, క్యారం, తైక్వాండో, టేబుల్ టెన్నిస్, రైఫిల్ షూటింగ్ చెస్ క్రీడలకు ప్రాంగణం ఏర్పాటు చేశామని, ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో తమ పాఠశాల క్రీడాకారులు ప్రతిభ చాటుతున్నారని అన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థి క్రీడల్లో భాగంగా మమేకమై ప్రాతినిధ్యం వహించాలని కోరారు. కరస్పాండెంట్ శ్రీ దేవి మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం పాఠశాల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. ఈ ఫలితాలు మా బృందం కృషికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ, పాఠశాల అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉపాధ్యాయుల పర్యవేక్షణ వల్లే మా పిల్లలు మంచి ఫలితాలు సాధించారని, పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఆంటోనీ హెచ్ఆర్ డైరెక్టర్ లత, వైస్ ప్రిన్సిపాల్ లు సరిత, సుధీర్ ,పాఠశాల ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు పాల్గొన్నారు.