Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 September 2024, 2:53 pm Posted by : ramakrishna

నవరాత్రోత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి

 . రెండో టౌన్ ఎస్సై యాసర్ అరాఫత్

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని నిజామాబాద్ రెండో టౌన్ ఎస్సై యాసర్ అరాఫత్ కోరారు. నగరంలోని గాజులపేట్ పద్మశాలీ సంఘం భవనంలో మంగళవారం శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గణేశ్ ఉత్సవాలు నిర్వహించే స్థలంలో డీజేలు, సౌండ్ బాక్స్ లు ఏర్పాటు చేసేందుకు అనుమతి తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టౌన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.