నిజామాబాద్ , బతుకమ్మ: ఇండియన్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడీయా జాతీయ కో అర్డినేటర్ గా నరాల నిహార్ ను నియమిస్తు ఐవైసీ సోషల్ మీడీయా నేషనల్ హేడ్ మనూ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం 5 గురు జాతీయ కోర్డినేటర్లను, 4 కో కోఅర్డినేటర్లను నియమిస్తు అదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ నగరానికి చెందిన నరాల నిహార్ జాతీయ కో అర్డినేటర్ గా ఉండగా ఇటివల యువజన కాంగ్రెస్ ఎన్నికల నేపథ్యంలో అపధవికి రాజీనామా చేశారు. ఈ నెల 14న యూత్ కాంగ్రెస్ ఎన్నికలు పూర్తి కావడంతో నరాల నిహర్ ను తిరిగి అదే పోస్టులో నియమాకం చేశారు. నరాల నిహార్ జిల్లాకు చెందిన సీనీయర్ కాంగ్రెస్ నేత నరాల రత్నాకర్ తనయుడు.
