Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 May 2025, 2:34 pm Posted by : ramakrishna

ఈ విద్యా సంవత్సరం నుంచి నవోదయ తరగతులు ప్రారంభం

నిజామాబాద్  ఎంపీ అరవింద్ చొరవతో

 నిజామాబాద్, బతుకమ్మ:

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో నిజామాబాద్ , జగిత్యాల జిల్లాలో రెండు జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల నిజామాబాద్ ఎంపీ అర్వింద్, నేటి పరిస్థితుల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించాలని నవోదయ అధికారులు ఆదేశించారు.  దీంట్లో భాగంగా విద్యాలయాల శాశ్వత మరియు తాత్కాలిక స్థలాలకు సంబంధించి అవసరమైన చర్యలు ప్రారంభించాలని నవోదయ విద్యాలయ సమితి  డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ లేఖ రాశారు. నిజామాబాద్ జిల్లాలో శాశ్వత భవన నిర్మాణానికి జక్రాన్ పల్లి మండలం కలిగోట్ గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 1063  లో , తాత్కాలిక వసతి కొరకు నాగారం శివారు లోని ప్రభుత్వ డైట్ కళాశాల ఎంపిక చేయబడ్డాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుని ఎలాంటి వివాదాలు లేని  కలిగోట శివారులోని 30 ఎకరాల భూమి నవోదయ విద్యాలయ సమితి పేరుపై బదలాయింపు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా శాశ్వత మరియు తాత్కాలిక భవనాల్లో  రోడ్లు, నీరు విద్యుత్ ,టెలికమ్యూనికేషన్ లాంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి విద్యా సంస్థ తాత్కాలిక భవనంలో ప్రారంభమయ్యే అందుకు అవసరమైన మరమ్మతుల పనుల స్థితిపై నివేదిక అందజేయాలని జవహర్ నవోదయ విద్యాలయం నిజాంసాగర్ ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. కాగా నవోదయ విద్యా సంస్థ మంజూరు చేయడంతో పాటు ఈ సంవత్సరం నుండి తరగతులు ప్రారంభమయ్యేలా చొరవ తీసుకోవడంతో పాటు , తాత్కాలిక   భవన మరమ్మత్తుల కొరకు తన యొక్క ఎంపీ  నిధుల ద్వారా 20 లక్షలు మంజూరు చేసినందుకు జిల్లా ప్రజలు ఎంపీ అర్వింద్ కు ధన్యవాదాలు తెలియజేశారు