Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 9:54 am Posted by : ramakrishna

1,114 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్

హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలిరౌండ్ లో 8926 ఓట్లు, రెండో రౌండ్ లో 9611 ఓట్లు పోలవగా.. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి సునీతకు తొలిరౌండ్ లో 8864 ఓట్లు, రెండో రౌండ్ లో 8609 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థికి 18,617 , బీఆర్ఎస్ అభ్యర్థికి 17,473 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రస్తుతం నవీన్ యాదవ్ 1,144 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.