ఉత్తమ నాట్య గురువు పురస్కారాన్ని అందుకున్న నవనీత గౌడ్ 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ శివాని నృత్య కళాశాల గురువు తాళ్లపల్లి నవనీత గౌడ్ కు అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో సిరాజ్ డాన్స్,ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో భారతీయ కళా వైభవం -2025కార్యక్రమంలో నాట్య గురువులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ జడ్జి డా.బుర్గుల మధుసుదన్,సరస్వతి ఉపాసకులు దైవజ్క్ శర్మ,ప్రొడ్యూసర్,నటి డా.రాజ కౌశిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ ను...