Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 August 2025, 5:37 pm Posted by : ramakrishna

ప్రకృతిని పరిరక్షించాలి

  • వీసీ ఆచార్య టి.యాదగిరి రావు

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ప్రకృతిని పరిరక్షించాలని తెయూ వీసీ ఆచార్య టి.యాదగిరి రావు అన్నారు.  తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ విభాగం యూనిట్ ఒకటి, నాలుగు ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో వన మనోత్సవం  ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ఆచార్య రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ ఛాన్స్లర్ ఆచార్య టీ. యాదగిరి రావు హాజరై మానవాళి మనుగడకు చెట్లు పెంపకం అత్యంత ఆవశ్యకమని తెలిపారు. అడవి విస్తీర్ణం తగ్గటం వల్లన వాతావరణ ప్రతికూల సమస్యలు ఏర్పడి దుర్భిక్ష పరిస్థితులతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పర్యావరణ రక్షణకు పాటు పడుతూ గ్రామ మరియు పట్టణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించి ప్రకృతిని పరిరక్షించాలన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి మాట్లాడుతూ పర్యావరణను క్షీణత వలన ఓజోన్ పొర నాణ్యత క్షీణించి ప్రజలకు తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారని దీని నివారించడానికి   ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలని సూచించారు. దీని కొరకు సామాజిక అడవులు పెంపకం, పట్టణ అటవీకరణతో పాటు అటవీ చట్టాలను కఠిన తరం చెయ్యాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ అరతి,కామర్స్ డీన్ ఆచార్య రాంబాబు,డైరెక్టర్ ( పి ఆర్ ఓ ) డాక్టర్ ఏ పున్నయ్య, యూజీసీ డైరెక్టర్  ఆచార్య ఆంజనేయులు, డా. నందిని,అతీక్ సుల్తాన్ ఘోరి, అడ్మిషన్స్ డైరెక్టర్ డా. వాసం చంద్రశేఖర్, డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ ఖవి, ప్రొఫెసర్ లావణ్య డా. ప్రసన్న రాణి ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ స్వప్న డాక్టర్ స్రవంతితోపాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.