Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 January 2025, 5:34 pm Posted by : ramakrishna

జాతీయవాదమే మాకు ప్రాణప్రదం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వార్షిక క్యాలెండర్లో వార్షిక ప్రగతి ప్రణాళికలు ఉంటేనే వాటికి సార్ధికత లభిస్తుందని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అన్నారు. న్యాయవాద పరిషత్ రాష్ట్ర కమిటీ రూపొందించిన 2025 వార్షిక క్యాలెండర్ ను జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్ లో  పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. నరేందర్ రెడ్డి, సభ్యులు దయావార్ నగేష్ ,బిట్ల రవి,బండారి కృష్ణనంద్, కిరణ్ కుమార్, భాను చందర్,స్నేహ, లిల్లీ ,నరేష్ కుమార్ లతో కలిసి ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. న్యాయవాద పరిషత్ జాతీయవాద దృక్పథంతో కార్యక్రమాలు నిర్వహిస్తుంద ఆయన తెలిపారు.ఒకే దేశం,ఒకే ప్రజా అనే సిద్ధాంతం ప్రతిప్రాధికన పని సంస్కృతిని పరిషత్ లక్ష్యంగా కలిగి ఉన్నదని జగన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో బార్  కార్యదర్శి వసంత్ రావు న్యాయవాదులు ఆశా నారాయణ, శరత్ చంద్ర, రణదీశ్,శ్రీహరి ఆచార్య, వేణు,మానిక్ రాజు తదితరులు పాల్గొన్నారు.