జాతీయ పసుపు బోర్డు సెక్రెటరీగా భవానీ శ్రీ బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇటీవల జాతీయ పసుపు బోర్డు సెక్రటరీగా నియమించబడ్డ భవాని సోమవారం నిజామాబాద్ లోని  జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే జక్రాన్ పల్లి మండలంలోని మనోహరాబాద్ లో గల జేఎంకేపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన పసుపు ఆధారిత పరిశ్రమను బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తో కలిసి సందర్శించారు. మూడు కోట్ల...