Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 March 2026, 7:28 pm Posted by : ramakrishna

ఏర్గట్ల గ్రామానికి చెందిన నేషనల్ వాలీబాల్ క్రీడాకారునికి సన్మానం

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల గ్రామానికి చెందిన ఏనుగంటి రాజు గౌడ్ కుమారుడైన ఏనుగంటి మనీష్ గౌడ్, ఎం.జె.పి కంజర రెసిడెన్షియల్ స్కూల్లో 9వ తరగతి చదువును కొనసాగిస్తూ, వాలీబాల్ క్రీడలో మంచి పట్టు సంపాదించడంతో తెలంగాణ రాష్ట్రం నుండి వాలీబాల్ క్రీడలో నేషనల్ టీం కి ఎంపికయ్యాడు. ఈమధ్య నే కలకత్తా లో జరిగిన నేషనల్ వాలీబాల్ క్రీడల్లో పాల్గొని వచ్చిన సందర్భంగా ఏర్గట్ల గ్రామ గీతా కార్మిక (గౌడ) సంఘ సభ్యులు నేషనల్ వాలీబాల్ క్రీడాకారుడైన మనీష్ గౌడ్ ను శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తుపాకుల శ్రీనివాస్ గౌడ్, రంగు కరుణాకర్ గౌడ్, రంగు గోవింద్ గౌడ్, రంగు వెంకటేష్ గౌడ్, మగ్గిడి వెంకటేష్ గౌడ్, సుదనవేణి శ్రీనివాస్ గౌడ్, సుదనవేణి నాగరాజ్ గౌడ్, కోలా రాజేష్ గౌడ్, ఏనుగంటి రాజు గౌడ్, పచ్చిమట్ల హరీష్ గౌడ్, సంపత్ గౌడ్, సుదన వేణి సాంబ గౌడ్, గీతా కార్మిక సంఘం సభ్యులు పాల్గొన్నారు.