Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 August 2024, 6:52 pm Posted by : ramakrishna

ఆర్ బి వి ఆర్ ఆర్ లో జాతీయ క్రీడా దినోత్సవం

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగర శివారులోని ఆర్ బి వి ఆర్ ఆర్ పాఠశాలలో మేజర్ జాన్సన్ జయంతి సందర్భంగా ఈనెల 27 నుండి 29 వరకు వివిధ క్రీడలు నిర్వహించినట్లు ఆర్ బి వి ఆర్ ఆర్ సొసైటీ చైర్మన్ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులకు నిర్వహించిన క్రీడల్లో బ్లూబెన్, డేఫిడెల్, రెడ్ రోజెస్, సామ్ రాక్ క్రీడలతోపాటు విద్యార్థులకు బాస్కెట్బాల్ వాలీబాల్ తదితరు క్రీడలను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇందులో మొదటి స్థానంలో గెలుపొందిన ముగ్గురికి షీల్డ్ లను బహుకరించినట్లు చెప్పారు. అదేవిధంగా రన్నర్నుగా గెలుపొందిన విద్యార్థులకు కూడా రెండవ బహుమతిగా షీల్డ్ లను బహూకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సెక్రెటరీ గోవర్ధన్ రెడ్డి, ఈసీ మెంబర్లు, విద్యా కమిటీ చైర్మన్ జగత్ రెడ్డి గెలుపొందిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వీణ, ఏహెచ్ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

National Sports Day in RBVRR