Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 August 2024, 5:35 pm Posted by : ramakrishna

నేషనల్ స్పేస్ డే సెలెబ్రేషన్స్

బతుకమ్మ, బోధన్ : నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూలలో శుక్రవారం నాడు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనలు, చంద్రయాన్ విజయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్, డ్రాయింగ్ కాంపిటీషన్ లాంటి కార్యక్రమాలు నిర్వహించారు.

సైకిల్ సే చాంద్ తక్..

నవీపేట్ మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో నేషనల్ స్పేస్ డే సెలెబ్రేషన్స్ ను సైకిల్ సే చాంద్ తక్ అనే కాన్సెప్ట్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్రో సాధించిన అంతరిక్ష విజయాలతో ఫోటో ఎగ్జిబిషన్, రాకెట్స్ మోడల్స్, క్విజ్ లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరమ్ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ బోగ లక్ష్మణ్ విద్యార్థులకు అంతరిక్షం, ఇస్రో, చంద్రయాన్ 3, గగన్ యాన్, లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ హన్మాండ్లు, గంగిరెడ్డి ఉపాధ్యాయులు సాయి రెడ్డి, శరత్, జ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు.