ఇందూరు పాఠశాలలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు
బోధన్, బతుకమ్మ : జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా బోధన్ పట్టణంలోని ఇందూరు పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా బోధన్ డివిజన్ ఏసిపి శ్రీనివాస్, అతిథులుగా పట్టణ సిఐ వెంకట్ నారాయణ, బోధన్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చందర్ రాథోడ్ లు పాల్గొని విద్యార్థులకు వాహన చట్టాలపై అవగాహన కల్పించారు. వాహనాలను ఎలా నడపాలి, వాహనాన్ని నడిపేటప్పుడు...