Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 January 2025, 6:47 pm Posted by : ramakrishna

ఇందూరు పాఠశాలలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు

బోధన్, బతుకమ్మ : జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా  బోధన్ పట్టణంలోని ఇందూరు పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా బోధన్ డివిజన్ ఏసిపి శ్రీనివాస్, అతిథులుగా పట్టణ సిఐ వెంకట్ నారాయణ, బోధన్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చందర్ రాథోడ్ లు పాల్గొని విద్యార్థులకు వాహన చట్టాలపై అవగాహన కల్పించారు. వాహనాలను ఎలా నడపాలి, వాహనాన్ని నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. రోడ్డు దాటే సమయంలో పాటించవలసిన నియమాల గురించి తెలిపారు. విద్యార్థులు తమ ఇంట్లో తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు వాహనాల నడిపే సమయాన తీసుకోవలసిన తగు జాగ్రత్తలు పాటించే విధంగా చూడాలని తెలిపారు. 18 సంవత్సరాల లోపు పిల్లలకు వాహనాలను నడపరాదని నడిపినట్లయితే చట్టరీత్యా చర్యలు వాహన యజమానులకు కూడా చట్టరీత్యా కఠినచర్యలు తీసుకోబడతాయని తెలిపారు.  వాహన నియమాలను ఖచ్చితంగా పాటించవలసిందిగా తెలిపారు. కార్యక్రమానంతరం పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ పాఠశాల తరఫున ముఖ్య అతిధులను శాలువా పూలగుచ్చంతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎంవిఐ అధికారులు, విద్యార్థులు,  తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

National Road Safety Month Celebrations in Indore School