Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 8:48 pm Posted by : ramakrishna

కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి జేపీ నడ్డా ను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి జేపీ నడ్డా ని న్యూడిల్లీ పార్లమెంట్ భవనం లో జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసారు. కేంద్ర విమాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహాయంతో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ జేఏసీ అధ్యక్షులు టి.జనార్దన్ ఆధ్వర్యంలో జాతీయ పీఎంపీ, ఆర్ఎంపీ జాయింట్ యాక్షన్ కమిటీ బుధవారం కలిసి తమ సమస్యల గురించి వివరించి, జాతీయ స్థాయిలో గుర్తింపు గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో జాతీయ జేఏసీ అధ్యక్షులు డాక్టర్ కేజీ గోవింద్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుండి జాతీయ కన్వీనర్ వీబీటీ రాజు, ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బళ్ళా శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ కన్వీనర్ జీఎస్ ప్రసాద్, ఎం.సుధాకర్, జాతీయ జేఏసీ నాయకులు తెలంగాణ నుండి పుల్గం మోహన్, గుజరాత్ నుండి సీఎస్ రావు, షకారియా నవీన్ చంద్ర, ఉత్తర ప్రదేశ్ నుండి ఓపీ మిశ్రా, యోగేష్ జోస్వాల్, బీహార్ నుండి అన్షూ తివారీ, పంజాబ్ నుండి ధన్మాల్ గోయల్, గుస్మైల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

 

National RMP and PMP JAC leaders meet Union Health Minister JP Nadda