Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 July 2025, 4:30 pm Posted by : ramakrishna

జెసిఐ ఇందూర్ కు జాతీయ అధ్యక్షుడి ప్రశంసలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సికింద్రాబాద్ లయన్స్ భవన్ లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా  జాతీయ అధ్యక్షులు అంకుర్ జున్జున్వాల జోన్ 12 అధికారులు, సభ్యులతో సమావేశం నిర్వహించారు. జెసిఐ ఇందూర్ చేపడుతున్న కార్యక్రమాల వీడియోను చూసి  అభినందిస్తూ అధ్యక్షురాలు గౌతమి పెండోటి కి, జోన్ అధికారి నయన్ లను జాతీయ అధ్యక్షుడి పిన్ తో సత్కరించారు. కార్యక్రమం లో జోన్ 12 అధ్యక్షుడు చతుర్వేది వుటుకూరు, జాతీయ కోఆర్డినేటర్ బంటు కిరణ్, జోన్ అధికారులు, జయంత్ శెట్టి, రామకృష్ణ, ఇందూర్  పూర్వ అధ్యక్షుడు చంద్రశేఖర్ పెండోటి, జోన్ 12 క్లబ్ ల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.

National President's appreciation to JCI Indore