Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 November 2024, 7:05 pm Posted by : ramakrishna

ఘనంగా జాతీయ పత్రిక దినోత్సవ వేడుకలు

  •  విలేకరులకు ఘనంగా సన్మానం

బతుకమ్మ,నవీపేట్ : జాతీయ పత్రిక దినోత్సవ వేడుకలు శనివారం నవీపేట మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్టులకు ఘనంగా సన్మానించారు.
ముఖ్య అతిథులుగా తహసిల్దార్ వెంకటరమణ ఎంపీడీవో నాగనాథ్, ఎంఈఓ అశోక్, హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు మెరుగైన సమాజం కొరకు నిరంతరం కృషి చేస్తున్నారని, వారి శ్రమ ఆమోఘమని ప్రశంసించారు. ప్రపంచం తో జరుగుతున్న సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నది విలేకరులని కొనియాడారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు అధికారులను చేరవేస్తారని అన్నారు. అధికారులకు ప్రజలకు వారదిలా పని చేస్తున్నారని తెలిపారు. పత్రిక యజమాన్యాలు, మరియు ప్రజాప్రతినిధుల ఒత్తిడిలను తట్టుకొని ఎల్లవేళలా ప్రజల పక్షాన నిలబడతారని తెలిపారు. తదనంతరం మొక్కలను నాటారు, ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ హన్మాండ్లు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, పిఆర్టియు మండల అధ్యక్షుడు, భూమయ్య, ప్రధాన కార్యదర్శి, శివకుమార్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.