జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా జడ్జీ సునీత కుంచాల నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈనెల 14న జిల్లాలో నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగపరుచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల పేర్కొన్నారు. గురువారం కోర్టు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజీమార్గమే రాజ మార్గమని ఏళ్ల తరబడిగా వివిధ కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులకు గురవుతున్న కక్షిదారులు ఈ లోక్ అదాలత్ ను సద్వినియోగపరుచుకోవాలన్నారు. ఇప్పటికే తమపై కోర్టుల ఆదేశాల ప్రకారం 14వ తేదీన మెగా లోక్ అదాలత్ ఉన్న...