Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 December 2024, 4:59 pm Posted by : ramakrishna

జాతీయ గణిత దినోత్సవం

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండల పాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జాతీయ గణిత దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ రావు శ్రీనివాస రామానుజన్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గణితం సబ్జెక్టు అన్ని సబ్జెక్టులకు  మూలం అని, గణితం లేకుండా నిత్యజీవితంలో మనుగడ సాగించలేమని తెలియజేశారు.పాఠశాల విద్యార్థులకు గణితంలో వివిధ పజిల్స్ గణిత ఆటలు ఆడించడం జరిగింది. గణితం పైన వివిధ ఆకృతులు,నమూనాలు ప్రదర్శించి వివరించారు. మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగినది. కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు చంద్రశేఖర్, మహేష్,రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

National Maths Day