Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 December 2025, 8:33 pm Posted by : ramakrishna

జాతీయ లోక్ అదాలత్ ఎల్లారెడ్డి కోర్టు లో భారీ గా వివాదాల పరిష్కారం..

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్ట్ లో ఆదివారం జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ (ఎన్ ఎల్ ఎస్ ఏ) పిలుపు మేరకు  కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కోర్టులో నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్ లో అనేక పౌర, క్రిమినల్, పిటి, బ్యాంక్, సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు రాజీ పద్ధతిలో తీర్మానించబడ్డాయి. ఈ  జాతీయ లోక్ అదాలత్ న్యాయమూర్తి సుష్మ ఆధ్వర్యంలో జరిగింది. దీర్ఘకాలం పాటు విచారణలో పెండింగ్‌లో ఉన్న వివాదాలు ఒకే రోజు  ప్రజల సమ్మతి‌తో  న్యాయ వ్యయాలు లేకుండా పరిష్కారం అయ్యాయి. సివిల్ తగాదాలు: 05,క్రిమినల్ కేసులు 34 జరిమానా రూ. 2,05,200, పిటి కేసుల 200 జరిమానా రూ. 1,33,000, బ్యాంకు తగాదాలు: 09 రూ. 2,35,000 రికవరీ, సైబర్ నేరాలు: 04 కు గాను రూ. 43,505 జరిమానా విధించారు.  రాజీ ఆధారిత సెటిల్‌మెంట్లు, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు: 57 చెక్ బౌన్స్ కేసు ( ఎన్ ఐ 138): 01 సమరసత/సత్యం కేసులు: 02 పరిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి సుష్మ మాట్లాడుతూ… లోక్ అదాలత్ లక్ష్యాలు పెండింగ్‌లో ఉన్న కేసుల భారాన్ని తగ్గించడం, ఖర్చు లేని, వేగవంతమైన న్యాయం అందించడం అన్నారు. ఇరు  పక్షాల మధ్య సమరసత నెలకొల్పడం, క్రిమినల్ చిన్న చిన్న నేరాల్లో జైలు శిక్ష నివారించడం , జరిమానాతో ముగింపుప్రజలకు లాభం అన్నారు. లోక్ అదాలత్ కారణంగా ప్రజలు ఏళ్ల తరబడి కోర్టు తిరగకుండా తక్షణ న్యాయం పొందగలరు అని తెలిపారు. కుటుంబ, ఆర్థిక, బ్యాంకింగ్ వివాదాలలో సర్దుబాటు, రికవరీ, క్షమాపణలు సాధ్యంస్థానిక పోలీస్, కోర్టు సిబ్బంది సమన్వయంతో సైబర్ , బ్యాంక్ కేసులు సమయానుకూల ఉపశమనం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోపాలరావు, న్యాయవాది పండరి ఎల్లారెడ్డి ఎస్‌ఐ మహేష్ కోర్టు సిబ్బంది, కోర్టు కానిస్టేబుల్ అలాగే పలువురు న్యాయవాదులు, సేవా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

National Lok Adalat Yella Reddy court resolves huge disputes