జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల బతుకమ్మ నిజామాబాద్ సిటీ : ఈనెల 28 శనివారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సత్వరమే పరిష్కరించే విధంగా జాతీయ లోక్ ఆడాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. రాజీమార్గమే రాజ మార్గమని అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి చైతన్యం తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగిందని,...