Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2025, 6:26 pm Posted by : ramakrishna

జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగపరచుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. చాలా మంది ప్రజల న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన , తక్కువ ఖర్చుతో పరిష్కరించడానికి భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ ను ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవాలన్నారు. ఇందులో చిన్న చిన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు, మైనర్ క్రిమినల్ కేసులు , సివిల్ డిస్ప్యూట్లు వంటి వివాదాలు లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కారం పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని న్యాయ స్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను తక్కువ సమయంలో ముగించుకోవచ్చన్నారు. ఇది ఒక శాంతియుత పరిష్కార విధానం కాబట్టి, పక్షాలు పరస్పర అంగీకారంతో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు.