ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశ గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డాక్టర్ శియాలి రామామృత రంగనాథన్ సేవలను కళాశాల సిబ్బంది, విద్యార్థులు స్మరించుకున్నారు. 1892 ఆగస్టు 12న జన్మించిన డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ భారతదేశంలో గ్రంథాలయ, సమాచార శాస్త్ర అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఆయనను “ఫాదర్ ఆఫ్...