Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 7:12 pm Posted by : ramakrishna

జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు…

 

రుద్రూర్, బతుకమ్మ :

 

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని చేనేత సహకార సంగం ఆవరణలో లోల శంకర్ అధ్యక్షతన కార్మికులకు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్బంగా అధ్యక్షులు మాట్లాడుతూ.. భారతీయ సాంస్కృతిక వారసత్వానికి, కళాత్మక సృజనాత్మకతకు మరియు గ్రామీణ ఆర్థిక రంగానికి వెన్నెముకగా నిలిచిన చేనేత రంగాన్ని గౌరవిస్తూ, చేనేత కార్మికుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ప్రధాన ‘జాతీయ చేనేత దినోత్సవమని అన్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 7న భారతదేశమంతటా ఈ దినోత్సవాన్ని ఎంతో వైభవంగా, అధికారికంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈసందర్బంగా బోధన్,  రుద్రూర్ లో గౌరవంగా పనిచేసి ఇంతటి సంఘ అభివృద్ధికి తొడ్పాటును అందించిన కార్మికులకు ఘనంగా సన్మానించడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. అదేవిధంగా సంగం అవరణలో సభ్యులకు సమక్షంలో ఎంసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మోత్కూర్ నారాయణ, కార్యదర్శి శ్యామ్ సుందర్ పహాడే, సభ్యులు బేతి గంగారాం, మోత్కూర్ సాయిలు, మోత్కూర్ లక్షణ్, తాటిపాముల విజయ్, జోర్రీగల లక్ష్మి, మోత్కూర్ కళావతి, సన్మాన గ్రహీతలు మామిడి పండరి, నూత్పల్లి నాగమణి, గట్టు సాయిలు, మోత్కూర్ నడిపి గంగారాం, సంగం సిబ్బంది ఈర్వ నాగరాజు, అంకం నర్సింహులు పాల్గొన్నారు.