తెలంగాణ యూనివర్సిటీలో జాతీయ గ్రీన్ కార్ప్స్ దినోత్సవం
డిచ్‌పల్లి, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) సెల్ ఆధ్వర్యంలో పర్యావరణ విద్యా కార్యక్రమం (ఈఈపీ) కింద జాతీయ గ్రీన్ కార్ప్స్ (ఎన్‌జీసీ) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ సెమినార్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించింది. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ - 2 కార్యక్రమాధికారి డా.ఎ.ఎ.హలీం ఖాన్ మాట్లాడుతూ జాతీయ గ్రీన్ కార్ప్స్ దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఎన్‌ఎస్‌ఎస్...