న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయవాది పరిషత్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని సరస్వతి నగర్‌లో గల పరిషత్ కార్యాలయం వద్ద జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ, ఎందరో మహనీయుల ఉద్యమాలు, ప్రాణత్యాగాల ఫలితంగా బ్రిటిష్ వలస పాలన నుంచి దేశానికి స్వాతంత్య్రం లభించిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సార్వభౌమత్వాన్ని...