బొబ్బిలి వీధిలో జాతీయ జెండా ఆవిష్కరణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని ఎల్లమ్మ గుట్ట లో బిజెపి నాయకులు బొబ్బిలి వేణు గోపాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. బొబ్బిలి వీధి లో విశ్వ జ్యోతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయ జెండాను బొబ్బిలి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మనోహర్, సదానంద్, రమేష్, మోహన్, శ్రీనివాస్, మైపాల్, లక్ష్మణ్, బొబ్బిలి అఖిలేష్, నవీన్, నిఖిల్ యూ సభ్యులు పాల్గొన్నారు.