Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 5:46 pm Posted by : ramakrishna

నైపుణ్యం, చతురతతోనే దేశ అభివృద్ధి

 

. . .  మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

నైపుణ్యం, చతురతతోనే దేశం గణనీయమైన అభివృద్ధి సాధించిందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత గంప గోవర్ధన్ అన్నారు. యువత ఉన్నత విద్యావకాశాలను సద్వినియోగం చేసుకుని దేశ అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం కామారెడ్డి బీఆర్‌ఎస్ నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద గంప గోవర్ధన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలకు 80వ స్వాతంత్య్ర  దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్య, నైపుణ్యాలను పెంపొందించుకుని యువత అన్ని రంగాల్లో ముందుకు సాగాలని సూచించారు. దేశ పురోగతికి యువత తమ వంతు సహకారం అందించాలని గంప గోవర్ధన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

 

National development stems from skill and ingenuity.