తెలంగాణ యూనివర్సిటీలో జాతీయ సదస్సు

  . . . ఐఎంసీ 2026 బ్రోచర్ ఆవిష్కరణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్ లోని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “ఇన్నోవేషన్స్ ఇన్ మెడిసినల్ కెమిస్ట్రీ (ఐఎంసీ - 2026)” అనే జాతీయ సదస్సు మార్చి 25–26 తేదీలలో నిర్వహించబడనుంది. దీనికి సంబంధించిన బ్రోచర్ ని యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ టి.యాదగిరిరావు, రిజిస్టార్ ఎం.యాదగిరి ఆవిష్కరించారు. విభాగాధిపతి డాక్టర్ కే.సాయిలు మాట్లాడుతూ ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు...