జిల్కార్ విజయానంద్ కు జాతీయ అవార్డు

నిజామాబాద్, బతుకమ్మ : నగరానికి చెందిన జిల్కార్ విజయానంద్ కు జోన్ 12 నుండి 2024 సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జాతీయ ఉత్తమ జేసీఐ అలుమ్ని క్లబ్ సభ్యుడిగా విన్నర్ అవార్డు జాతీయ చైర్మన్ అంబలగన్ అందచేశారు. హైదరాబాద్ లోని  నొవోటల్ హెచ్ఐసీసీ లో శుక్రవారం జరిగిన జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అలుమ్ని క్లబ్ జాతీయ సదస్సులో జరిగిన అవార్డ్స్ ఫంక్షన్ లో 29 జోన్లు పాల్గొన్నాయి. 2024 రీజియన్, జోన్ స్థాయిలోనూ విజయానంద్ కు విన్నర్ అవార్డులు దక్కాయి. జాతీయ అవార్డు...