Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 December 2024, 6:07 pm Posted by : ramakrishna

జిల్కార్ విజయానంద్ కు జాతీయ అవార్డు

నిజామాబాద్, బతుకమ్మ : నగరానికి చెందిన జిల్కార్ విజయానంద్ కు జోన్ 12 నుండి 2024 సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జాతీయ ఉత్తమ జేసీఐ అలుమ్ని క్లబ్ సభ్యుడిగా విన్నర్ అవార్డు జాతీయ చైర్మన్ అంబలగన్ అందచేశారు. హైదరాబాద్ లోని  నొవోటల్ హెచ్ఐసీసీ లో శుక్రవారం జరిగిన జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అలుమ్ని క్లబ్ జాతీయ సదస్సులో జరిగిన అవార్డ్స్ ఫంక్షన్ లో 29 జోన్లు పాల్గొన్నాయి. 2024 రీజియన్, జోన్ స్థాయిలోనూ విజయానంద్ కు విన్నర్ అవార్డులు దక్కాయి. జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది అని విజయానంద్ హర్షం వ్యక్తం చేశారు. అవార్డు రావడానికి తను చేసిన కార్యక్రమాలకు సహకారం అందించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో జాతీయ అధికారులు వినయ్ మెహత, మనోజ్ టక్కర్, జోన్ 12 చైర్మన్ జి వి ఎన్ రాజు, జోన్ అధికారులు నవీన్ చవల్ల, డీవీఎస్పీ గుప్త, విశాఖ, శీతల్, శ్రీచందన ,పూర్వ అధ్యక్షులు హరిదర్షన్ సలికే,సమీర్షా, వేముల చంద్రశేఖర్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

National Award to Zilkar Vijayanand