“నషా ముక్త్ భారత్ అభియాన్” విజయవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా జిల్లాలో ఈ నెల 20వ తేదీ నుంచి 26 వరకు నిర్వహించనున్న నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఈ నెల 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు...