Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 5:10 pm Posted by : ramakrishna

వ్యాయామశాల హనుమాన్ ఆలయ అధ్యక్షునిగా నార్ల సురేష్…

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలోని వ్యాయామశాల హనుమాన్ మందిర ఆలయ అధ్యక్షునిగా మాజీ ఏఎంసీ చైర్మన్ నార్ల సురేష్ ను ఎండోమెంట్ అధికారులు ప్రకటించారు. గతంలో నార్ల సురేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమకారుడిగా రైతుల సంక్షేమం కోసం పాటుపడడం జరిగింది. సభ్యులుగా విద్యాసాగర్, నార్ల ఉదయ్, కొక్కెర శారద, దాసరి శ్రీనివాస్ లను నియమించారు. వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిల సహకారంతో ఆలయ అధ్యక్షునిగా నియమించినందుకు నార్ల సురేష్ తో పాటు సభ్యులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.