Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 7:25 pm Posted by : ramakrishna

తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన నారిమల్ల ప్రవళిక

 

. . . ఆసియా అండర్-23 అథ్లెటిక్స్‌ లో స్వర్ణం

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

ఆసియా అండర్ – 23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ – 2026 లో స్వర్ణ పతకం సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన గురుకుల విద్యార్థిని నారిమల్ల ప్రవళికను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభినందించారు. చైనాలోని ఓర్డోస్‌లో నిర్వహించిన ఆసియా అండర్ – 23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ – 2026 లో మహిళల 4×400 మీటర్ల రిలే విభాగంలో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించింది. ఈ విజయానికి భాగస్వామ్యమైన నారిమల్ల ప్రవళికను శుక్రవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన చాంబర్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రవళికకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. నారిమల్ల ప్రవళిక సాధించిన విజయం తెలంగాణ యువతకు ప్రేరణగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఆమె భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.