Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 February 2025, 4:02 pm Posted by : ramakrishna

నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

  • ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు యడవల్లి వివేక్ స్వామి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు యడవల్లి వివేక్ స్వామి పిలుపునిచ్చారు.   ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పలువురు ఎన్ ఎస్ యు ఐ నాయకులను  ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నియోజకవర్గ, మండల స్థాయి కోఆర్డినేటర్లుగా నియమించామని తెలిపారు. జిల్లా ఎన్ఎస్యూఐ నాయకులతో తనకు ఎంతో మంచి సంబంధం ఉంది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఎన్ ఎస్ యు ఐ నూతనంగా నియమింపబడిన నియోజకవర్గ, మండల స్థాయి కోఆర్డినేటర్లు, ఎన్ఎస్యూఐ నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు.  బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి ఎన్నో అక్రమాలు చేశాడని, నరేందర్ రెడ్డి పైన అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నాడని, నరేందర్ రెడ్డి ని ఎమ్మెల్సీగా గెలిస్తే పట్టభద్రుల సమస్యల పట్ల పోరాటం చేస్తాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,వరుణ్,నికిల్,శివ, మరియు తదితరులు పాల్గొన్నారు.