దేశ విచ్చిన్నమే నరేంద్రమోదీ ప్రధాన అజెండా
ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు నేర్లకంటి శ్రీకాంత్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మోడీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా దేశ పౌరులంతా ఐక్యంగా ఉద్యమించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు నేర్లకంటి శ్రీకాంత్ అన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏఐవైఎఫ్ జిల్లా జనరల్ బాడీ సమావేశం పి. రంజిత్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి అఖిలభారత యువజన సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు నేర్లకంటి శ్రీకాంత్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రజల మధ్య విబేధాలు సృష్టించి, విచ్చిన్నం ద్వారా రాజ్య పాలన చేయాలని,భారతదేశంలో...