Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 9:55 pm Posted by : ramakrishna

నరేంద్ర మోడీ రాక తెలంగాణలో బిజేపికి పునాదుల కోసమే

 

. . . తెలంగాణలో బిజేపి అధికారంలోకి వచ్చే వరకు కొట్లాట ఆగదు

 

. . . నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

పశ్చిమ బెంగాల్, బిహార్, మద్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో బిజేపిని గెలిపించిన నరేంద్రమోడి తెలంగాణలోకి రావడానికి అధికార పునాదుల కోసమే అని నిజామాబాద్ ఎంపి అర్వింద్ ధర్మపురి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడి తెలంగాణ పర్యటనలో భాగంగా ఈ నెల 10న  పరేడ్ గ్రౌండ్ లో జరిగే భారీ బహిరంగ సభ ను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. శనివారం రాత్రి నగరంలోని కోటగల్లి మైసమ్మ వీదిలో కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజుర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సానంపుడి సైదిరెడ్డి హాజరయ్యారు. ఈ సంధర్బంగా ఎంపి అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ తెలంగాణలో అక్క చెల్లేల్లను కేసిఆర్ సీయంగా రెండు సార్లు రేవంత్ రెడ్డి ఓక్కసారి మోసం చేసిండు అని ప్రధాని మోడికి చెప్పిన..ఎన్నిసార్లు మోస పోయిన వారికి ఓటు వేసినారు. ఈ సారి మాత్రం మహిళలు బిజేపి ఓటు వేస్తారని నమ్ముతున్నాను. ప్రధానీ మోడి దేశంలోని మహిళలకు కేజి టూ పిజీ ఉచిత విద్యా అందించడానికి సంకల్పం తీసుకున్నారు. డబుల్ బేడ్ రూం అని మోసం చేసిండు.. పీజు రియెంబర్స్ మెంట్ ను బంద్ పెట్టిండు కేసిఆర్.. జాబ్ క్యాలండర్ అని ప్రతి సంవత్సరం ఇచ్చేది బంద్ పెట్టిండు. ఆరోగ్య బీమాను బంద్ పెట్టిండు. ప్రభుత్వ స్కూల్ మూసిండు. వరి వేస్తే ఉరి అని వ్యవసాయం దండగ అన్నాడు. అన్ని బంద్ పెట్టిండు కాని రెండు వేల పించన్ ఇచ్చిండు. కాని 2023 లో కేసిఆర్ ను ఓడించినారు.

 

Narendra Modi's arrival is only for laying the foundations for BJP in Telangana

 

రాష్ట్రంలో బిజేపి అధికారంలో వచ్చే వరకు మన కోట్లాట అగదు. రేవంత్ రెడ్డి ప్రజలను ఇందిరమ్మ ఇండ్లు అని మోసం చేసిండు. కళ్యాణ లక్ష్మికి తోడు తులం బంగారం అని మోసం చేసిండు.. స్కూటిలు ఇవ్వలేదు… నాలుగు వేల పించన్ అని మోసం చేసిండు. కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేస్తా అని రేవంత్ మోసం చేసిండు. కేసిఆర్ కోటి ఎకరాలను సస్యశ్యామలం చేస్తా అని మోసం చేసిండు. తెలంగాణ ప్రజలు కేవలం అవినీతిని మాత్రమే చూసిండు. కేంద్రంలో బిజేపి అధికారంలోకి వచ్చిన రామగుండం ఏర్పాటు చేసి ప్రారంభించాం. అండర్ గ్రౌండ్  డ్రైనేజీలు ఎప్పుడు ప్రారంభిస్తారు.. బిజేపి అధికారంలోకి వచ్చిన తరువాత జాతీయ రహదారులు చూడండి.. రాబోయే రెండు నెలల్లో నిజామాబాద్ రైల్వే స్టేషన్ చూడండి. గవర్నమెంట్ ఆస్పీటల్ లో డాక్టర్ లు లేరు.. ఎప్పుడు కులిపోతుంది అని భయపడుతున్నాం. బస్ స్టాండ్ ఎమైన చేసిండా. వికలాంగులను మహిళలను రేవంత్ రెడ్డి మోసం చేసిండి. గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలల్ అడుగు పెట్టరాదు.. డ్వాక్రా మహిళలకు రుణా మాఫీ చేస్తా అన్నాడు. పావళ వడ్డి వస్తుందా. పావుల వడ్డి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకనే రుణా మాఫీ జరుగడం లేదు అని ఎంపి అరవింద్ అన్నారు.మోడి అధికారంలోకి వచ్చిన తరువాత  12 కోట్ల ఇండ్ల నిర్మాణం చేసిండు.14 కోట్ల ఇండ్లలో టాయిలేట్ లు కట్టించిండు.20 కోట్ల కుటుంబాలకు 5 లక్షల కింద ఆరోగ్య బీమా ఇస్తున్నారు. జీరో అకౌంట్ బ్యాంక్ లలో ఒపెన్ చేయించారు. దయా చేసి.. కార్పొరేటర్లను ఇద్ధరు ఎమ్మెల్యేలను గెలిపించారు. నన్ను రెండు సార్లు మెజార్టీతో గెలిపించారు.  బిజేపిని అశీర్వాదించాలి.. రానున్న రోజుల్లో బిజేపిని అశీర్వాదించాలని ఎంపి అరవింద్ పిలుపు నిచ్చారు. ఈ కార్నర్ మిటింగ్ లో బిజేపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారీ, పసుపు బోర్డు చైర్మెన్ పల్లె గంగారెడ్డి, బిజేపి మహిళ నేత స్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు బంటు రాము, సుమిత్ర తదితరులు ఉన్నారు.

 

Narendra Modi's arrival is only for laying the foundations for BJP in Telangana