- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి
కామారెడ్డి, బతుకమ్మ : విద్య, సమాజం పట్ల అవగాహన గల వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డి అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవల కేంద్ర ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో మన రాష్ట్రానికి అధిక నిధులు ఇవ్వకుండా సవతి తల్లి ప్రేమ చూపించిందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కెసిఅర్ ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని బిఆర్ఎస్ అంటుందని తెలిపారు. బిఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క వర్గం బాగుపడలేదని విమర్శించారు. పట్టభద్రుల ఎన్నికల ప్రభావం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై ఉంటుంది కాబట్టి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నరేందర్ రెడ్డి కి ఓటు వేసేలా చూడాలని పిలపునిచ్చారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని గెలిపించి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను కాపాడాలని కోరారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేదావులతో జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. ఇంటిలో ఉద్యోగం వస్తుందన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కెసిఅర్ కుటుంబం బాగుపడుంది తప్ప రాష్ట్రం బాగుపదలేదని విమర్శించారు. 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. శాఖల వారీగా ఉన్న అన్ని ఉద్యోగ ఖాళీలను నింపే నాయకుడు రేవంత్ రెడ్డి అని అన్నారు. లోపాయకారి ఒప్పందంతో బిఆర్ఎస్ పార్టీ బీజెపీ పార్టీకి సహకారం చేస్తుందన్నారు. బిఆర్ఎస్ పార్టీ చేసిన అప్పుకు కాంగ్రెస్ పార్టీ వడ్డీ కడుతుందని తెలిపారు. బిజెపి పార్టీ నుండి గెలిసిన 8 మంది ఎంపీలు, ఇద్దరు

మంత్రులు ఉండి రాష్ట్రానికి తెచ్చింది సున్నా అని ఎద్దేవా చేశారు. బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పాటు పడుతుందన్నారు. భవిష్యత్తులో బీసీ బిడ్డలకు అవకాశాలు రావాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. పట్టభద్రులందరూ నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పెంచాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో మేటి రాష్ట్రంగా నిలపడమే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ధ్యేయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 2008 డీఎస్సీకి చెందిన 1600 మంది అభ్యర్థులకు ఐదు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత పండిత్ లకు, పిఈటీ లకు పదోన్నతులు కల్పించారని అన్నారు. ప్రతి పట్టభద్రునికి 3 లక్షల రూపాయల వరకు ఆరోగ్య భీమా సౌకర్యం తన స్వంత నిధులతో కల్పిస్తానని హామీ ఇచ్చారు. తనకు వేసే ప్రతి ఓటు మహేష్ కుమార్ గౌడ్ గెలుపును చూపిస్తుందని తెలిపారు. ఈ నెల 27 న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
