కామారెడ్డి జిల్లాలో రూ.7 కోట్ల విలువైన మత్తు పదార్థాల దహనం

కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలోని వివిధ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్డీపీఎస్ చట్టం పరిధిలో నమోదైన 71 కేసుల్లో పట్టుబడిన నిషేదిత మత్తుపదార్థాలను దహనం చేశారు. నిజామాబాద్ డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతురావు ఆధ్వర్యంలో 1285.25 కిలోల ఎండుగంజాయి, 32.585 కిలోల అల్ర్పాజోలం, 71.845 కిలోల డైజోఫాం, 114 గంజాయి మొక్కల విలువ రూ.7 కోట్ల 98 లక్షల 70 వేల 250 ఉంటుందని వాటిని నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లిలో గల...