Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 February 2025, 8:03 pm Posted by : ramakrishna

జెఈఈ మెయిన్స్ లో నారాయణ విద్యార్థిని ప్రతిభ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ సెషన్ -1 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. జిల్లాకు చెందిన నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థిని పంచ మహల్కర్ రియా 99.83 పర్సంటైల్ సాధించి జిల్లా టాప్ ర్యాంకర్ గా నిలిచింది. నగరానికి చెందిన ప్రముఖ డాక్టర్ పంచ మహల్కర్ ఆనంద్, నీలిమ దంపతుల కూతురు రియా చదువులో చిన్నపటి నుంచి ఉత్తమ ఫలితాలను సాధిస్తుంది. ఈ సందర్భంగా ఏజీఎం కుంట లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మొత్తం కళాశాలకు చెందిన 80 మంది విద్యార్థులు జెఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్షలు రాయగా 20 మందికి పైగా అడ్వాన్స్ అర్హతలు సాధించినట్లు ఆయన తెలిపారు. ఇంటర్ ఫలితాలలోనే కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు సాధించారని అన్నారు. కళాశాల స్థాపించిన రెండవ సంవత్సరంలోనే ఇంతటి ఘనమైన ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవిగౌడ్, ఏవో శేఖర్, కోర్డిన్ యువి ప్రసాద్, జీఎం కాట్రగడ్డ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.

Narayana student's merit in JEE Mains