Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 November 2024, 4:40 pm Posted by : ramakrishna

నారాయణ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి 

 ఆర్మూర్ ఎంఇఓకు పిర్యాదు చేసిన లంబాడి స్టూడేంట్ ఆర్గనైజేషన్

 ఆర్మూర్, బతుకమ్మ: 

పేద విధ్యార్ధుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆర్మూర్ నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆర్మూర్ డివిజన్ ఇన్చార్జి జాదవ్ సాయికృష్ణ అన్నారు. ఆర్మూర్ ఎంఈఓ కార్యాలయంలో నారాయణ పాఠశాల మీద చర్యలు తీసుకోవాలని  ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి  ఆర్మూర్ డివిజన్ ఇన్చార్జి జాదవ్ సాయికృష్ణ మాట్లాడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు ఇబ్బంది పెడుతూ వేలాది రూపాయలు తీసుకుంటున్నారు అన్నారు. కావున ఈ పాఠశాల గుర్తింపును రద్దు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాథోడ్ జీవన్ తదితరులు పాల్గొన్నారు.