Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2025, 6:19 pm Posted by : ramakrishna

ఘనంగా ప్రారంభమైన నారాయణ ప్రీమియర్ లీగ్ జోనల్ లెవల్ పోటీలు

. . . ప్రారంభించిన డిఈవో అశోక్

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

 

నారాయణ స్కూల్స్ ఆధ్వర్యంలో నారాయణ ప్రీమియర్ లీగ్ (ఎన్పీఎల్) జోనల్ స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నిజామాబాద్‌లోని ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్‌లో గురువారం ఆదిలాబాద్ జోన్, నిజామాబాద్ జోన్‌ల నారాయణ స్కూల్స్ జోనల్ స్థాయి పోటీలను నిర్వహించారు.

Narayana Premier League zonal level competitions kick off with a bang

ఈ పోటీలను జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ కుమార్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణ స్కూల్స్ ఆధ్వర్యంలో నారాయణ ప్రీమియర్ లీగ్ జోనల్ లెవల్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రీడా స్పూర్తి పెంపొందుతుందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక ధృడత్వానికి దోహదపడుతాయన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహిస్తున్న నారాయణ పాఠశాలను అభినందించారు.

Narayana Premier League zonal level competitions kick off with a bang

ఏజీఎం శివాజి మాట్లాడుతూ విద్యార్థులలో క్రీడా స్ఫూర్తి, జట్టుకృషి,  ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఎన్ పీఎల్ లో వివిధ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నారాయణ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించారన్నారు.

Narayana Premier League zonal level competitions kick off with a bang

కార్యక్రమం గ్రాండ్ గా విజయవంతమైందని, విద్యార్థుల నిర్వహణ, ఉత్సాహాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం ప్రసాద్, హై స్కూల్ ఆర్ డీ హెడ్ అశోక్, చాంప్స్ ఆర్ డీ హెడ్ స్వాతి, ఈ కిడ్జ్ ఆర్ డీ హెడ్ సంగీత, కోఆర్డినేటర్లు రాకేష్, అజీమా, కల్పన, నరేష్, కళ్యాణి, ఆదిలాబాద్, నిజామాబాద్ జోన్ల ప్రిన్సిపాల్స్ చందన, రజని, కిషోర్, నిర్మల్ ప్రిన్సిపాల్ పార్వతి ,భైంసా ప్రిన్సిపాల్ ప్రభు, ఆదిలాబాద్ ప్రిన్సిపాల్ స్వర్ణలతలు  హాజరయ్యారు. కరణ్ నేతృత్వంలోని క్రీడా బృందం, సాఫ్ట్ స్కిల్స్ బృందం, స్పోర్ట్స్ ఇంచార్జ్ పవన్, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రీమియం లీగ్ లో పాల్గొన్నారు.