నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
సోమవారం ప్రకటించిన జేఈఈ మెయిన్ 2026 ఫలితాలలో నారాయణ జూనియర్ కాలేజ్ నిజామాబాద్ విద్యార్థి ఇంజనీరింగ్ విభాగంలో పల్లెర్ల విరాజ్ 99.73 పర్సెంటైల్ సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలవడం అనేది నిజామాబాద్ జిల్లాకి గర్వకారణం అని నారాయణ కళాశాల నిజామాబాద్ ఏజిఎం కుంట లక్ష్మారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ రవి గౌడ్ తెలిపారు. అలాగే ఎం.విష్ణు ప్రసాద్ 97.53, డి జె ప్రతీక్ 96.72, బోగా శ్రీచరణ్ ఆదిత్య 96.71, బింగి వరుణ్ 96.26, యెనుగుల శ్రీరామ్ 95.64, ఎల్లా సాత్విక్ 95.06, కె. వెంకట అనీష్ 94.23, ట్యాంక్ సిద్ధి 94.1, బి.ఓం సాయి మహంత 91.63, కే. సాయి శ్రీఖర్ 87.21, ఆర్. రాంచరణ్ 85.94, కదం హాసిని 84.68, వంగ హర్షవర్ధన్ 84.36, కొండపాక మోక్షద 83.98, దేశ్ ముఖ్ అథర్వ్ 82.65, బానోత్ క్రాంతికుమార్ 82.16 జాతీయస్థాయి పర్సెంటైల్ సాధించారు. ఇలా జేఈఈ మెయిన్ 2026 లో క్వాలిఫై అయ్యే మార్కులు 22 మంది విద్యార్థులతో ఉత్తమ ప్రదర్శన కనబరిచారని తెలిపారు. 2024 జేఈఈ మెయిన్స్ ఫలితాలలోను మర్రి హర్ష 99.62 జిల్లాలో అత్యధిక పర్సంటేల్ అలాగే 2025 జేఈఈ మెయిన్స్ ఫలితాలలోను పంచ మహాల్కర్ రియా 99.83 లాంటి జిల్లాలో అత్యధిక పర్సంటేల్ సాధించి వరుసగా మూడవ సంవత్సరం నారాయణ కాలేజ్ విద్యార్థులు విజయ పదంలో నిలిచారని పేర్కొన్నారు. మెడికల్ విభాగంలో గాంధీ మెడికల్ కాలేజ్, సిద్దిపేట మెడికల్ కాలేజీలలో సీట్లు సాధించారని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 468, బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 438 మార్కులు, అలాగే సీనియర్ ఇంటర్ లో 1000 మార్కులకు కాను 993 మార్కులు సాధించి జిల్లా ఖ్యాతిని ఎలుగెత్తి చాటారన్నారు. ఇలాగే జెఈఈ, ఎంసెట్, ఐఐటి, నీట్ లాంటి ఏ పోటీపరీక్షలైనా నారాయణ కళాశాల నిజామాబాద్ జిల్లాకి గర్వకారణంగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల నారాయణ విద్యాసంస్థల జిఎం కాట్రగడ్డ శ్రీనివాసరావు, కోర్ డీన్ వీరాంజనేయ ప్రసాద్, కళాశాల ఏఓ మేధరి శేఖర్, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలకి, స్టాఫ్ కి స్వీట్స్ తినిపించుకుంటూ, బాణాసంచా కాల్చుతూ అట్టహాసంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

