నారాయణ కళాశాలలను సీజ్ చేయాలి

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రభుత్వ గుర్తింపు, సంబంధిత శాఖల అనుమతులు లేకుండా నిర్వహించబడుతున్నట్లు ఆరోపణలు ఉన్న నారాయణ విద్యాసంస్థల కళాశాల భవనాలను సీజ్ చేసి, సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక (టివియువి), తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్ (టిఎస్ఎఫ్) జిల్లా కమిటీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డిఐఈఓ) రవి కుమార్‌కు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక నగర అధ్యక్షుడు సుభాష్, తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్...