నారాయణ సీబీఎస్ఈ కేశపూర్ బ్రాంచ్‌పై చర్యలు తీసుకోవాలి
డిచ్ పల్లి, బతుకమ్మ : డిచ్ పల్లి మండలం కేశపూర్ గ్రామ శివారులో నారాయణ సీబీఎస్ఈ బ్రాంచ్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని యు ఎస్ ఎఫ్ ఐ, టీజీవీపీ, ఏఐఎఫ్‌డీఎస్ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిర్మాణం పూర్తికాకముందే భవనంలో అక్రమంగా పాఠశాల నిర్వహిస్తూ భారీ ఫీజులతో అడ్మిషన్లు చేపడుతున్నారని ఆరోపిస్తూ సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. విద్యార్థి సంఘాల నాయకులు పెద్ది సూరి (యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి), బొబ్బిలి కళ్యాణ్ (టీజీవీపీ జిల్లా...