నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది గాంధారి నరసింహ రెడ్డి ని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమిస్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఆయన మూడు సంవత్సరాలపాటు విధులు నిర్వహిస్తారు.క్రిమినల్ కేసులలో పోలీసుల తరపున ప్రాసిక్యూటర్ గా వ్యవహరిస్తారు. నిజామాబాద్ రూరల్ మండలం అనంతగిరి గ్రామానికి చెందిన నరసింహ రెడ్డి విద్యాబ్యాసం నగరంలోని ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేశారు. డిగ్రీ అనంతరం ఉస్మానియా యునివర్సిటీ నుండి లా పట్టాభద్రులై గత నలభై ఏళ్లుగా నిజామాబాద్ జిల్లాకోర్టు లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.1983 లో ఖానాపూర్ సొసైటీ అధ్యక్షడిగా, జిల్లా కోపరేటివ్ సొసైటీ డైరెక్టర్ గా పని చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాజకీయ జీవితం కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్ రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది అమిదాల సుదర్శన్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రెడ్డి, న్యాయవాదులు ఆకుల రమేష్,ప్రభాకర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ దయాకర్ గౌడ్, పిసిసి క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర సభ్యుడు జి. వి. రామకృష్ణ, నరసింహ రెడ్డి నియమాకం పట్ల హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.