Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 March 2025, 1:40 pm Posted by : ramakrishna

లక్ష్మీ నరసింహస్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన నారాలోకేశ్ దంపతులు

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఏపీలోని మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి నిర్వహించిన స్వామి వారి కల్యాణమహోత్సవంలో మంత్రి నారాలోకేశ్ దంపతులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను వారు సమర్పించారు. వేద మంత్రోఛ్చారణలు, మంగళవాయిద్యాల మధ్య వైభవంగా స్వామి వారి కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితులు లోకేశ్ దంపతులకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు.


Naralokesh couple offering silk clothes to Lord Lakshmi Narasimha Swamy