Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 September 2025, 6:27 pm Posted by : ramakrishna

దేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా నంద్యాల శ్యామ్

బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయం ఆవరణలో శుక్రవారం సార్వజనిక్ దేవి ఉత్సవ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నంద్యాల శ్యామ్‌ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ప్రధాన కార్యదర్శిగా రాజులదేవి పవన్, కోశాధికారిగా ఉద్మీర్ సందీప్, ఉపాధ్యక్షుడిగా మాసులా సురేష్‌ను ఎంపిక చేశారు. కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో గుమ్మల అశోక్ రెడ్డి, రుద్ర సత్యనారాయణ, శంకర్ రెడ్డి, పూజారి లింగం, బెంజరీ గంగారం, హరికాంత్ చారి,  గోపి కిషన్ మాసుల శ్రీనివాస్, గడ్డం సాయిలు, గమరపేట శ్రీనివాస్, గుంత గంగాధర్ తదితర ప్రముఖులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నంద్యాల శ్యామ్ మాట్లాడుతూ ‘‘ఈనెల 22న శ్రీ దుర్గామ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరుగనుంది. అందరూ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’’ అని కోరారు.

Nandyala Shyam appointed as the president of the Devi Utsav Committee