నేషనల్ టర్మరిక్ బోర్డ్ ను సందర్శించిన నంద్యాల రైతులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గుంటూరు ఆఫీస్ నుండి నంద్యాల రైతులు స్టడీ టూర్‌లో భాగంగా గురువారం నిజామాబాద్ నేషనల్ టర్మరిక్ బోర్డ్ కార్యాలయాన్ని సందర్శించారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి వారిని సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పసుపు పంట పెంపకం, క్రయ విక్రయాల గురించి రైతులకు వివరించారు. పసుపు రైతుల అభ్యున్నతి కోసం ఇలాంటి విజ్ఞాన యాత్రలు మరిన్ని జరగాలని అన్నారు.