Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2025, 4:54 pm Posted by : ramakrishna

కాంబోడియాలో నందిపేట వాసి మృతి

  • కోటపాటిని కలిసిన కుటుంబ సభ్యులు

 

నందిపేట్, బతుకమ్మ : నందిపేట గ్రామవాసి సోరిపేట విజయ్ కుమార్ (37) రెండున్నర సంవత్సరాల కిందట కాంబోడియా  దేశానికి ఉపాధికై  వెళ్లి అక్కడి హోటల్ లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న క్రమంలో ఆరోగ్యం క్షీణించి పచ్చ కామెర్ల  వ్యాధితో మూడు రోజుల క్రితం మరణించాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగి పోయారు. విజయ్ కుమార్ అక్కడ ఎటువంటి ఉద్యోగ వీసా లేకపోవడంతో విజిట్ వీసా మీదనే ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నందిపేట బిజెపి నాయకులు పెయింటర్ రాజు పటేళ్లు రాజులు విజయ్ కుమార్ మృత దేహాన్ని త్వరగా ఇంటికి రప్పించడానికి కుటుంబ సభ్యుల ను వెంటపెట్టుకొని ఆర్మూర్ కు వచ్చి ´ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక అధ్యక్షుడు” కోటపాటి నరసింహం నాయుడును కలిసి విజయ్ కుమార్ మృత దేహం రప్పించడానికి సహాయ పడాల్సిందిగా కోటపాటిని అభ్యర్థించారు. కోటపాటి వెంటనే స్పందించి కాంబోడియా ఇండియన్ ఎంబసీకి సమాచారం అందించి రవాణా చర్చలు మంజూరు చేసి త్వరగా మృతదేహం ఇండియాకు పంపాల్సిందిగా కోరారు. అక్కడ ఉన్న తమిళనాడు వాసి సామాజిక సేవకుడు సయ్యద్ వాసివ్ తో సంప్రదించి ఎంబసీ అధికారులను కలిసి సహాయపడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.  వారు అందుకు సరే అని తొందరగా పంపడానికి తన వంతు సహాయం అందిస్తానని హామీ చేశారు. కోటపాటిని కలిసిన వారితో విజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు నందిపేట బిజెపి నాయకుడు పెయింటర్ రాజులు ఉన్నారు. ఇండియన్ ఎంబసీ అధికారులు వెంటనే స్పందించి నిజామాబాద్ కలెక్టర్ నుండి వీరి ఆర్థిక పరిస్థితి గురించి సర్టిఫికెట్ పంపించిన వెంటనే మృతదేహాన్ని తమ ఖర్చుతో ఇండియాకు పంపిస్తామని ఈమెయిల్ ద్వారా తెలిపారు.